logo

చిన్నారి మృతి వెనుక మరో కోణం!

తాడిగడప వద్ద బందరు కాల్వలో పడి చిన్నారి మిస్సీప్రియ(7) అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం  వెనుక మరో కోణం వెలుగులోకి వస్తోంది.

Published : 28 Nov 2022 04:04 IST

మిస్సీప్రియ మృతదేహం

పెనమలూరు, న్యూస్‌టుడే: తాడిగడప వద్ద బందరు కాల్వలో పడి చిన్నారి మిస్సీప్రియ(7) అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం  వెనుక మరో కోణం వెలుగులోకి వస్తోంది. జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో విరక్తి చెందిన తల్లి హెప్సిబా తన కుమార్తెతో పాటు తాను తనువు చాలించాలనుకొని బందరు కాల్వలో దూకడంతో చిన్నారి నీటి ఉద్ధృతికి కొట్టుకుపోగా హెప్సిబాను మాత్రం స్థానికులు రక్షించినట్లు పోలీసులు గుర్తించారు. హెప్సిబా కుటుంబం గన్నవరం మండలం బీబీగూడెంలో నివసిస్తుండగా ఈమె  మూడ్రోజుల క్రితం తాడిగడప కార్మికనగర్‌లోని తన సోదరి ఇంటికి కుమార్తెతో కలిసి వచ్చింది. అప్పటికే ఆమె రెండో వివాహం చేసుకున్న తిరుపతయ్యతో వివాదాలున్నట్లు సమాచారం. దీంతో విసిగిపోయిన ఆమె.. తన కుమార్తెతో కలిసి శనివారం వేకువ జామున బందరు కాల్వ ఒడ్డుకు చేరుకొని ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు హెప్సిబాను అదుపులోకి తీసుకుని సంఘటనకు దారితీసిన పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని