TDP: ఉత్సాహంగా ‘జై తెలుగుదేశం’ పాట చిత్రీకరణ
తెదేపా నాయకులు, కార్యకర్తలే కథానాయకులు, నటీ నటులయ్యారు. అనుభవం ఉన్న కళాకారులను తలపించే రీతిలో నటనలో ‘జీవించారు’. ‘బాహుబలి’ చిత్రంలోని యుద్ధ సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ‘శత్రువు’పైకి దూసుకు వెళ్లారు.
ఈడుపుగల్లులో షూటింగ్ సందడి
నగారాలతో దుమ్మురేపుతున్న తెదేపా నాయకులు
ఈడుపుగల్లు(కంకిపాడు/కంకిపాడు గ్రామీణం): తెదేపా నాయకులు, కార్యకర్తలే కథానాయకులు, నటీ నటులయ్యారు. అనుభవం ఉన్న కళాకారులను తలపించే రీతిలో నటనలో ‘జీవించారు’. ‘బాహుబలి’ చిత్రంలోని యుద్ధ సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ‘శత్రువు’పైకి దూసుకు వెళ్లారు. ఎన్నికల యుద్ధ భేరి(నగారా) మోగించారు. గుర్రాలతోపాటు పరుగెత్తి దుమ్ము లేపారు. ఆరు పదులు నిండిన నాయకులు సైతం 20 ఏళ్ల యువకులతో పోటీపడి పరుగెత్తారు. ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న భారీ జెండాను గంటపాటు ఈదురుగాలిలో అలుపులేకుండా నిలబెట్టిన కార్యకర్త పార్టీపై అభిమానాన్ని చాటాడు. ఇక బయట నుంచి వచ్చిన బాలికలు సంప్రదాయ, శాస్త్రీయ నృత్యాలు, యువకులు పాశ్చ్యాత్య సంగీతానికి అనుగుణంగా స్టెప్పులు వేశారు. ఆదివారం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు పరిధిలోని పంట పొలంలో జరిగిన ‘జై తెలుగుదేశం.. జైజై తెలుగుదేశం’ పాటకు తగ్గ సన్నివేశాల షూటింగ్‌తో సందడి నెలకొంది. పాటలో ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ప్రగతి, అభివృద్ధిని ప్రస్తావించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ‘శత్రువు’(అధికార పార్టీని) ఎదుర్కోవాల్సిన అవసరం, వ్యూహం, ‘తెలుగుతల్లి’ గొప్పతనం తదితర అంశాలు ఇతి వృత్తంగా ఉన్నాయి. క్రమంలో ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్య, లోకేష్ చిత్రాలతో కూడిన ‘యుద్ధబేరి’లను మాజీ ఎంపీపీ, తెదేపా సీనియర్ నాయకుడు దేవినేని రాజా, పార్టీ మండల ప్రతినిధులు, సర్పంచి పి.ఇందిర తదితరులు ‘మోగించడం’తో పాటను ప్రారంభించారు. తెదేపా జెండాలు, రంగు, పొగతో ప్రాంగణం పసుపు మయమైంది.
‘బాహుబలి’లో యుద్ధ సన్నివేశాన్ని తలపించే ‘దృశ్యం’
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kotamreddy: అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Movies News
Varun Tej: మెగా నివాసంలో పెళ్లి బాజాలు.. వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు స్పష్టత
-
Ap-top-news News
Andhra News: బాలిక కడుపు నుంచి కిలోకు పైగా జుత్తు తొలగింపు
-
Movies News
Asha Saini: ఆ నిర్మాత నన్ను హింసించాడు.. ఆశా సైనీ షాకింగ్ కామెంట్స్..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
AP Govt: ఒకే నెలలో రూ.12 వేల కోట్లకు పైగా అప్పు