logo

నడిచొచ్చే ఏటీయం...

బ్యాంక్‌ ఎకౌంట్‌లో డబ్బులు ఉన్నా, వెళ్లి తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారా? ఏటీఎంలలో డబ్బులు లేవా..? అసలు ఏటీయంలే మీ ప్రాంతంలో లేవా..? ఇలా సమస్యలతో సతమతమవుతున్న వారందిరికీ మీ ఇంటికే ఏటీఎం నడిచొచ్చే అవకాశాన్ని భారతీయ తపాలాశాఖ తీసుకొచ్చింది.

Published : 28 Nov 2022 04:04 IST

ఏఈపీఎస్‌ విధానం ద్వారా తోట్లవల్లూరు మండలం యాకమూరులో పోస్ట్‌మ్యాన్‌ నుంచి ఇంటిదగ్గరే నగదు స్వీకరిస్తున్న వృద్ధురాలు

బ్యాంక్‌ ఎకౌంట్‌లో డబ్బులు ఉన్నా, వెళ్లి తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారా? ఏటీఎంలలో డబ్బులు లేవా..? అసలు ఏటీయంలే మీ ప్రాంతంలో లేవా..? ఇలా సమస్యలతో సతమతమవుతున్న వారందిరికీ మీ ఇంటికే ఏటీఎం నడిచొచ్చే అవకాశాన్ని భారతీయ తపాలాశాఖ తీసుకొచ్చింది. ‘ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం’ (ఎఇపిఎస్‌) ఆధార్‌ నంబర్‌ ఉండి, ఫోన్‌కు వచ్చే ఓటిపి చెప్పి, వేలిముద్ర వేస్తే చాలు రూ.10వేల వరకూ పోస్ట్‌మ్యాన్‌ మీఇంటికే డబ్బులు తెచ్చి ఇస్తారు. మీకు ఏబ్యాంకులో ఎకౌంట్‌ ఉన్నా పర్వాలేదు, ఎన్నిసార్లు కావాలన్నా, దేశంలో ఎక్కడైనా, నగరాల నుంచి గ్రామీణ పోస్టాఫీస్‌ల వరకూ డబ్బులు తీసుకోవచ్చు. పోస్ట్‌మ్యాన్‌ దారిలో కనపడినా, మీ ప్రాంత పోస్ట్‌మ్యాన్‌కు ముందే ఫోన్‌ చేసి చెప్పి డబ్బులు ఇంటికి తెమ్మని మరీ తీసుకోవచ్చు. ఈ సౌకర్యం కల్పన విషయంలో పురోగతి సాధించామని ఏపీ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ డా.అభినవ్‌ వాలియా ‘ఈనాడు’కి    తెలియచేశారు. 

- ఈనాడు, కృష్ణా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని