logo

‘గౌడ కులస్థులకు సీఎం ప్రాధాన్యం’

గౌడ కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, వారికి అన్ని విధాగాలుగా అండగా ఉంటానని మంత్రి జోగి రమేష్‌ పేర్కొన్నారు.

Published : 28 Nov 2022 04:04 IST

మాట్లాడుతున్న మంత్రి జోగి రమేష్‌

గొల్లపూడి, న్యూస్‌టుడే: గౌడ కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, వారికి అన్ని విధాగాలుగా అండగా ఉంటానని మంత్రి జోగి రమేష్‌ పేర్కొన్నారు. కొత్తూరుతాడేపల్లిలో ఆదివారం జరిగిన గౌడ సంఘీయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గౌడ కులస్థులకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎన్నో ఏళ్ల తర్వాత మంత్రి వర్గంలో చోటు కల్పించారన్నారు. ఇలా అందరూ ఒకచోట కలవడం సంతోషంగా ఉందని, మున్ముందు ఇదే స్ఫూర్తి కొనసాగించాలన్నారు. కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ కులస్థులందరూ ఐక్యంగా ఉండాలని, గౌతు లచ్చన్న ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. రాజకీయాల్లో గౌడ కులస్థుల ప్రాతినిధ్యం పెరగాలని, ఎవరైనా ఎన్నికల్లో నిలబడితే వారికి అండగా ఉండాలన్నారు. సీఎంగా తప్ప మిగిలిన అన్ని పదవుల్లోనూ గౌడ కులస్థులు పని చేశారన్నారు. నూజివీడు డీఎస్పీ అశోక్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ నేటికి మన కులస్థులు అనేక మంది వెనకబడి ఉన్నారన్నారు. విద్యా పరంగా మరింత ముందుకు సాగాలన్నారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు కల్లు గీత కార్మికులను సన్మానించారు. గన్నవరం ఎంపీపీ అనగాని రవి, జి.కొండూరు ఎంపీపీ లక్ష్మీతిరుపతమ్మ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చలపాటి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్‌ ఉయ్యూరు గోపాలరావు, నాయకులు దొంతగాని వెంకటేశ్వరరావు, పోతురాజు మాధవరావు, వి. నాగరాజు, శ్రీనివాసరావు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని