logo

దళిత మహిళననే చులకనగా మాట్లాడారా?

దళిత మహిళననే తనపట్ల చులకనగా మాట్లాడారా? అంటూ చల్లపల్లి సర్పంచి పైడిపాముల కృష్ణకుమారి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబును ప్రశ్నించారు.

Published : 28 Nov 2022 04:04 IST

ఎమ్మెల్యే తీరుపై సర్పంచి నిరసన

ఆందోళనలో కన్నీరు పెట్టుకుంటున్న సర్పంచి కృష్ణకుమారి

చల్లపల్లి, న్యూస్‌టుడే : దళిత మహిళననే తనపట్ల చులకనగా మాట్లాడారా? అంటూ చల్లపల్లి సర్పంచి పైడిపాముల కృష్ణకుమారి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబును ప్రశ్నించారు. గాంధీ స్మృతివనంలో ఆదివారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే తనపట్ల ప్రవర్తించిన తీరుపై కన్నీటిపర్యంతమయ్యారు. కంచె సమస్య పరిష్కరించాలనుకుంటే పిలిపించి కూర్చొని మాట్లాడాలి కానీ, మందీ మార్బలంతో వచ్చి దురుద్దేశంతో అవమానకరంగా మాట్లాడారని పేర్కొన్నారు. సర్పంచులందరితోనూ ఇలాగే ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. సర్పంచి పైడిపాముల కృష్ణకుమారిపట్ల ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు దారుణమని, ఎమ్మెల్యే సోమవారం ఉదయం పది గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే అతని ఇంటిని ముట్టడిస్తామని తెదేపా జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తొలుత గాంధీ విగ్రహానికి, అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ నినదించారు. ఎంపీపీ కోట విజయరాధిక, వైస్‌ ఎంపీపీ మోర్ల రాంబాబు, ఎంపీటీసీ సభ్యులు పైడిపాముల స్వప్న, రాజులపాటి అంకమ్మ, మట్టా కోమలి, మాలెంపాటి శ్రీనివాసరావుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని