logo

ప్రణాళిక లేక... ప్రజాధనం వృథా

ముందస్తు ఎటువంటి ప్రణాళిక లేకుండా నగరపాలక సంస్థ అధికారులు తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజాధనం వృథా అవుతోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 28 Nov 2022 04:04 IST

ముందస్తు ఎటువంటి ప్రణాళిక లేకుండా నగరపాలక సంస్థ అధికారులు తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజాధనం వృథా అవుతోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంజిసర్కిల్‌ వంతెన కింద మొక్కలు వేసి పార్కులు అభివృద్ధి చేయాలని తలచిన అధికారులు వంతెన స్తంభాలన్నిటికి ఐదు నెలల క్రితం వివిధ రకాల పెయింటింగ్స్‌ వేయించారు. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా దీనికి శ్రీకారం చుట్టారు. నగరంలో కళాశాల విద్యార్థులందరి చేత సందేశాత్మక పెయిటింగ్స్‌ వేయించారు. ఇప్పుడు వాటిపై కొత్తగా మొక్కలు ఏర్పాటు చేయడానికి స్టాండ్స్‌ వేస్తున్నారు. పెయింటింగ్స్‌ అన్ని మాయమై వాటి స్థానంలో ఇప్పుడు మొక్కలు రానున్నాయి.

- ఈనాడు అమరావతి

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని