logo

ఇంటికి పిలిచి అరెస్టులు చేయించారు

చల్లపల్లి సర్పంచి కృష్ణకుమారిని ఎమ్మెల్యే ఏకవచనంతో మాట్లాడి అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని తెదేపా చేసిన డిమాండ్‌పై ఎమ్మెల్యే తన ఇంటికి రమ్మని వీడియోలో చెప్పి పోలీసులతో అరెస్టులు చేయించారని తెదేపా జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు ఆరోపించారు.

Published : 29 Nov 2022 05:21 IST

ఎమ్మెల్యే తీరుపై మండిపడిన తెదేపా

ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి బయలుదేరిన తెదేపా నాయకులు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: చల్లపల్లి సర్పంచి కృష్ణకుమారిని ఎమ్మెల్యే ఏకవచనంతో మాట్లాడి అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని తెదేపా చేసిన డిమాండ్‌పై ఎమ్మెల్యే తన ఇంటికి రమ్మని వీడియోలో చెప్పి పోలీసులతో అరెస్టులు చేయించారని తెదేపా జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు ఆరోపించారు. సోమవారం ఉదయం నియోజకవర్గంలోని అన్ని మండలాల తెదేపా అధ్యక్షులు, ఎస్సీ సెల్‌, మహిళా నాయకులను హౌస్‌ అరెస్టులు చేసిన పోలీసులు 22 మందిని కోడూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం 5 గంటల తర్వాత విడుదల చేశారు. దీనిపై కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇంటికి రమ్మని చెప్పిన ఎమ్మెల్యే చల్లపల్లి పారిపోవడం ఏమిటని ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డుకోవద్దని వీడియోలో ఎమ్మెల్యే చెప్పిన మాటలను కాదని పోలీసులు తెల్లవారుజాము నుంచే అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే చల్లపల్లి సర్పంచి కృష్ణకుమారికి క్షమాపణ చెప్పాలన్నారు.

అడుగడుగునా తనిఖీలు, అరెస్టులు

ఉదయం నుంచి నియోజకవర్గంలోని అన్ని రహదారుల కూడళ్లలో పోలీసులు మోహరించి తనిఖీలు చేశారు. మహిళా నాయకులను కూడా బయటకు రాకుండా నిలువరించి, వ్యతిరేకించిన వారిని అరెస్టు చేశారు. ఆర్టీసీ బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలను సైతం తనిఖీచేసి పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని