logo

పెండ్లి కుమారునిగా సుబ్రహ్మణ్యేశ్వరుడు

శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయంలో మార్గశిర షష్ఠి కల్యాణోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి.

Published : 29 Nov 2022 05:21 IST

నేడు షష్ఠి కల్యాణోత్సవం

పెండ్లి కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరునికి పట్టువస్త్రాలను

అందజేస్తున్న ఆలయ ఏసీ చక్రధరరావు

మోపిదేవి, న్యూస్‌టుడే: శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయంలో మార్గశిర షష్ఠి కల్యాణోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ సహాయ కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు సోమవారం తెలిపారు. తొలి రోజున స్వామిని పెండ్లికుమారునిగా అలంకరించారు. ముగ్దమోహనరూపుడైన స్వామి ఇరువైపులా శ్రీవల్లీ దేవసేనతో భక్తులకు దర్శనమిచ్చారు. దేవదాయ, ధర్మదాయ శాఖ, చల్లపల్లి ఎస్టేట్‌ దేవాలయాల వంశపారంపర్య ధర్మకర్తలు సంయుక్తంగా పెండ్లికుమారునికి పట్టువస్త్రాలను ఆలయ ఏసీ ప్రధానాచర్చకుడు బుద్ధు పవన్‌కుమార్‌శర్మకు అందించగా, స్వామికి అలంకరించారు. మాఘమాస స్వామివారి షష్ఠి కల్యాణోత్సవం మంగళవారం రావటం విశేషమని వేద పండితులు కొమ్మూరి నాగఫణిశర్మ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని