logo

మహిళపై వైకాపా సర్పంచి దాడి

భూ వివాదంపై మాట్లాడేందుకు ఓ మహిళను ఇంటికి పిలిచిన వైకాపా సర్పంచి, ఆమెపై దాడికి పాల్పడ్డారంటూ ఇచ్చిన ఫిర్యాదుపై కృష్ణా జిల్లా బంటుమిల్లి స్టేషన్‌లో కేసు నమోదైంది.

Published : 29 Nov 2022 05:21 IST

ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న గూడవల్లి గంగాలక్ష్మి

బంటుమిల్లి, న్యూస్‌టుడే: భూ వివాదంపై మాట్లాడేందుకు ఓ మహిళను ఇంటికి పిలిచిన వైకాపా సర్పంచి, ఆమెపై దాడికి పాల్పడ్డారంటూ ఇచ్చిన ఫిర్యాదుపై కృష్ణా జిల్లా బంటుమిల్లి స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ మహిళ కుటుంబ సభ్యులు తనపై దాడికి వచ్చారంటూ సర్పంచి ఫిర్యాదు చేశారు. బాధితులు, పోలీసుల కథనం.. మండలంలోని అర్తమూరు గ్రామానికి చెందిన గూడవల్లి గంగాలక్ష్మి విజయవాడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల అర్తమూరులో ఉంటున్న కుమారుని ఇంటికి వచ్చారు. వారి వ్యవసాయ భూమికి సంబంధించిన వివాదం గురించి మాట్లాడేందుకు రావాలని గ్రామ సర్పంచి బొర్రా రమేష్‌ కబురుపెట్టడంతో సోమవారం కొడుకుతో కలిసి ఆమె సర్పంచి ఇంటికి వెళ్లారు. మాట్లాడే క్రమంలో సర్పంచి లక్ష్మిపై దాడి చేయడంతో సృహ కోల్పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం మచిలీపట్నం జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. తనపై దాడికి పాల్పడటమే కాకుండా, అడ్డుకునేందుకు వచ్చిన తన కుమారుడిని భయపెట్టారంటూ బాధితురాలుచేసిన ఫిర్యాదు మేరకు బంటుమిల్లి స్టేషన్‌లో కేసు నమోదైంది. వివాద పరిష్కారం నిమిత్తం తన ఇంటికి వచ్చి తనపై  లక్ష్మి, ఆమె కొడుకు దాడిచేసి గాయపర్చారంటూ సర్పంచి రమేష్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్సై పైడిబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని