AP High Court: నారాయణపై అప్పుడే చర్యలొద్దు.. తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్‌లో ఉంచింది.

Published : 29 Nov 2022 14:21 IST

అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్‌లో ఉంచింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. గతంలో చిత్తూరు తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు.. నారాయణ బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 30న లొంగిపోవాలని ఆదేశించింది ఈవిషయమై నారాయణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని