logo

చంద్రబాబుకు ఘన స్వాగతం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం  ఘన స్వాగతం లభించింది. ఏలూరు జిల్లా వెళుతున్న ఆయనకు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో  బొమ్ములూరు, కలపర్రు టోల్‌ప్లాజాల వద్ద తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికారు.

Published : 01 Dec 2022 06:12 IST

బొమ్ములూరు టోల్‌ ప్లాజా వద్ద పార్టీ శ్రేణుల కోలాహలం

హనుమాన్‌జంక్షన్‌ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం  ఘన స్వాగతం లభించింది. ఏలూరు జిల్లా వెళుతున్న ఆయనకు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో  బొమ్ములూరు, కలపర్రు టోల్‌ప్లాజాల వద్ద తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు నేతృత్వంలో గన్నవరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు, వీరమాచనేని సత్యప్రసాద్‌ నేతృత్వంలో వేర్వేరుగా ద్విచక్ర వాహన ప్రదర్శనతో అధినేతను తోడ్కొని వెళ్లారు. అనంతరం దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబుకు స్వాగతం పలికారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు