logo

శాస్త్రీయ, కర్ణాటక సంగీతానికి విశేష ఆదరణ

సినీ సంగీతానికే ప్రేక్షకులు ఆకర్షితులవుతారనే నానుడికి చరమగీతం పాడేలా.. శాస్త్రీయ, కర్ణాటక సంగీతానికి విశేష ఆదరణ లభించడం ఆనందదాయకమని శ్రీఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నాట్య కళాశాల ప్రిన్సిపల్‌ కె.ఎస్‌.గోవిందరాజన్‌ అన్నారు.

Published : 01 Dec 2022 06:12 IST

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే : సినీ సంగీతానికే ప్రేక్షకులు ఆకర్షితులవుతారనే నానుడికి చరమగీతం పాడేలా.. శాస్త్రీయ, కర్ణాటక సంగీతానికి విశేష ఆదరణ లభించడం ఆనందదాయకమని శ్రీఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నాట్య కళాశాల ప్రిన్సిపల్‌ కె.ఎస్‌.గోవిందరాజన్‌ అన్నారు. దుర్గాపురంలోని శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నాట్య కళాశాలలో ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహిస్తున్న శ్రీసద్గురు సంగీత సభ 29వ వార్షిక సంగీత మహోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు వయోలిన్‌ విద్వాంసులు టి.కె.వి.రామానుజాచార్యుల సంగీత కచేరీ ఆకట్టుకుంది. సభలో గోవిందరాజన్‌ మాట్లాడుతూ.. శాస్త్రీయ, కర్ణాటక సంగీతానికి రానున్నవన్నీ మంచి రోజులే అని సంగీత సభ కార్యక్రమాల ద్వారా వెల్లడైందన్నారు. లబ్ధప్రతిష్టులైన సంగీత విద్వాంసులతో నిర్వహించిన కార్యక్రమాలకు విశేష రీతిలో శ్రోతలు తరలివచ్చి, ఉత్సాహం నింపారని చెప్పారు. విద్వాన్‌ ఎన్‌.సి.హెచ్‌.బుచ్చయాచార్యులకు సంగీత విద్వన్మణి బిరుదును నిర్వాహకులు అందజేశారు. వయోలిన్‌ విద్వాంసుడు రామానుజాచార్యులు, గాత్ర విద్వాంసుడు మోదుమూడి సుధాకర్‌ తదితరులు అభినందన సందేశాన్ని అందజేశారు. శ్రీ సద్గురు సంగీత సభ అధ్యక్షుడు బి.వి.ఎస్‌.ప్రకాష్‌, ఉపాధ్యక్షుడు జె.ప్రభాకర్‌శాస్త్రి, కార్యదర్శి పోపూరి గౌరీనాధ్‌, సహాయ కార్యదర్శి జె.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ శర్మ, కోశాధికారి వి.ఆర్‌.సుబ్రహ్మణ్యం, సభ్యులు మాట్లాడుతూ.. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన సంగీత విద్వాంసులకు, శ్రోతలకు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని