logo

ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆక్టోపస్‌

ఇంద్రకీలాద్రిపై దాడి చేసిన ఉగ్రవాదులను ఆక్టోపస్‌ దళాలు మట్టుబెట్టాయి. వివరాల్లోకి వెళ్తే.. ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేసిన సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆక్టోపస్‌ అధికారులు మాక్‌ డ్రిల్‌ను బుధవారం రాత్రి ఇంద్రకీలాద్రిపై నిర్వహించారు.

Published : 01 Dec 2022 06:12 IST

మాక్‌డ్రిల్‌లో భాగంగా మహామండపం వద్ద బాంబు వేసి లోపలకు పరిగెడుతున్న ఉగ్రవాదులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే :  ఇంద్రకీలాద్రిపై దాడి చేసిన ఉగ్రవాదులను ఆక్టోపస్‌ దళాలు మట్టుబెట్టాయి. వివరాల్లోకి వెళ్తే.. ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేసిన సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆక్టోపస్‌ అధికారులు మాక్‌ డ్రిల్‌ను బుధవారం రాత్రి ఇంద్రకీలాద్రిపై నిర్వహించారు. ముందుగా ఉగ్రవాదులు ముఠా మహామండపం మెట్ల మార్గం నుంచి లోపలకు ప్రవేశించారు. వారు అక్కడ బాంబులు వేసి మహామండపం మొదటి అంతస్తులోకి వెళ్లి నక్కారు. విషయం తెలిసిన వెంటనే ఆక్టోపస్‌ దళాలు ఘాట్‌ రోడ్డు మీదుగా ప్రధాన ఆలయంలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి మహామండపం మొదటి అంతస్తులోకి వెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆక్టోపస్‌కు స్థానిక పోలీసులు సహకరించారు.

* దుర్గగుడిలో భద్రతపై దేవస్థానం ఈఈ కోటేశ్వరరావు, వన్‌టౌన్‌ సీఐ సురేష్‌రెడ్డి, ఆలయ సెక్యూరిటీ, అగ్నిమాపక శాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆక్టోపస్‌ అదనపు ఎస్పీ శ్రీరామచంద్రమూర్తి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ  అనూహ్య సంఘటన జరిగినప్పుడు భక్తుల భద్రతకు తీసుకోవాల్సన చర్యలపై క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆక్టోపస్‌ సీఐలు నాగరాజు, శివాజి, ఎస్పీఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని