logo

నేడు, రేపు ఈనాడు ఆటో ఎక్స్‌పో

విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్‌రోడ్డులోని సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల మైదానంలో శనివారం, ఆదివారం నిర్వహిస్తున్న ‘ఈనాడు ఆటో ఎక్స్‌పో’ ప్రదర్శనలో అన్ని కంపెనీలకు సంబంధించిన వాహనాలకు సంబందించిన సమగ్ర సమాచారం ఒకే చోట లభిస్తోంది.

Published : 03 Dec 2022 04:52 IST

ఉదయం 10 గంటలకు ప్రారంభం

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్‌రోడ్డులోని సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల మైదానంలో శనివారం, ఆదివారం నిర్వహిస్తున్న ‘ఈనాడు ఆటో ఎక్స్‌పో’ ప్రదర్శనలో అన్ని కంపెనీలకు సంబంధించిన వాహనాలకు సంబందించిన సమగ్ర సమాచారం ఒకే చోట లభిస్తోంది. ఏ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి?, తగ్గింపులు ఏమైనా ఇస్తున్నారా?, ఫైనాన్స్‌ వెంటనే వస్తుందా?, పాత వాహనం మార్చుకోవాలంటే ఏం చేయాలి? తదితర వివరాలన్నీ ఈ ఎక్స్‌పోలో లభిస్తాయి. దీనికి ప్రవేశం ఉచితం.ఇక్కడ కొనుగోలు చేసేవారికి ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నారు. కొన్ని మోడళ్ల కార్లు, ద్విచక్రవాహనాలపై తగ్గింపు ఉంది. విద్యుత్తు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

సందర్శకులకు లక్కీడ్రా: ఆటో ఎక్స్‌పో ప్రదర్శనకు వచ్చేవారు ‘ఈనాడు’ స్టాల్‌ వద్ద ఉన్న కూపన్‌ను పూర్తిచేసి లక్కీడ్రా బాక్స్‌లో వేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని