logo

నగ్న వీడియోలు బయటపెడతానని బెదిరింపులు

ప్రేమించుకున్నపుడు తీసుకున్న నగ్న వీడియో కాల్స్‌ను బయటపెడతానంటూ ఓ యువతిని బెదిరిస్తున్న బొర్రా అరవింద్‌, విశ్వనాథ్‌ అనే ఇద్దరు యువకులపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 03 Dec 2022 04:52 IST

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : ప్రేమించుకున్నపుడు తీసుకున్న నగ్న వీడియో కాల్స్‌ను బయటపెడతానంటూ ఓ యువతిని బెదిరిస్తున్న బొర్రా అరవింద్‌, విశ్వనాథ్‌ అనే ఇద్దరు యువకులపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ నగర శివారుకు చెందిన ఓ యువతి (26) గతంలో ఒక విమానయాన సంస్థలో సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసింది. ఆ సమయంలో బొర్రా అరవింద్‌ను ప్రేమించింది. వీరిద్దరూ ఫోన్లు చేసుకుంటూ, మేసెజ్‌లు చేసుకునేవారు. కొన్ని సార్లు నగ్న వీడియో కాల్స్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో అరవింద్‌ ప్రవర్తన సరిగా లేకపోవటంతో.. ఆమె అతడిని దూరం పెట్టింది. ఇది జీర్ణించుకోలేక అరవింద్‌.. ఆమెను బెదిరించటం ప్రారంభించాడు. పూర్వం లాగా తనతో ఉండకపోతే నగ్న వీడియో కాల్స్‌ను తల్లిదండ్రులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించాడు. అలాగే అరవింద్‌ స్నేహితుడు విశ్వనాథ్‌ కూడా నగ్న వీడియోలను వాట్సాప్‌, యూ ట్యూబ్‌లో పెడతానని యువతిని బెదిరించాడు. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిశ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని