logo

పోరంకిలో సినీనటుడు బాలకృష్ణ సందడి

ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం రాత్రి పోరంకిలో సందడి చేశారు.

Published : 04 Dec 2022 03:37 IST

వివాహ వేడుకలో బాలయ్య

పెనమలూరు, న్యూస్‌టుడే: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం రాత్రి పోరంకిలో సందడి చేశారు. కుటుంబ సన్నిహితుడు, పోరంకి మాజీ సర్పంచు ఐనంపూడి చంద్రశేఖర్‌ను కలుసుకుని వారి యోగక్షేమాలను తెలుసుకుని ఉల్లాసంగా  గడిపారు. అనంతరం బాలకృష్ణ పెనమలూరు కూడలిలోని ఆలపాటి గార్డెన్స్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. బాలకృష్ణతో సెల్ఫీ దిగడానికి అభిమానులు ఉత్సాహం చూపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని