logo

ధాన్యం లోడుకు రూ.2 వేలు అడుగుతున్నారు

మొవ్వ మండలంలోని ఏ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దా లేని విధంగా భట్లపెనుమర్రులో ధాన్యం లోడు చేయడానికి అదనంగా రూ.2వేలు డిమాండ్‌ చేస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 04 Dec 2022 03:37 IST

అన్నదాతల ఆగ్రహం

భట్లపెనుమర్రు రైతు భరోసా కేంద్రం వద్ద రైతుల ఆందోళన

భట్లపెనుమర్రు(కూచిపూడి), న్యూస్‌టుడే: మొవ్వ మండలంలోని ఏ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దా లేని విధంగా భట్లపెనుమర్రులో ధాన్యం లోడు చేయడానికి అదనంగా రూ.2వేలు డిమాండ్‌ చేస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులైన బోలెం రవి, బోలెం నాగరాజు, పెద్ది వెంకయ్య, బోలెం నవీన్‌, వెంకటేశ్వరరావు, వీరంకి జగదీష్‌, శొంఠి రమేష్‌, మోర్ల కోటేశ్వరరావు, సంగిశెట్టి సాంబశివరావుతోపాటు పలువురు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో దీనిపై వాదోపవాదాలు జరిగాయి. వారం రోజుల కిందట మిషన్‌తో కోసి ఆరబెట్టిన తరువాత శుక్రవారం సంచులు వచ్చాయి. కాటా వేసిన అనంతరం ఈరోజు లోడు ఎత్తే సమయంలో రూ.2 వేలు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. తొలిగా ధాన్యం లోడు తీసుకువెళ్లిన సమయంలో నిబంధనల మేరకు తీసుకువెళ్లారన్నారు. తొలిసారి ధాన్యం తీసుకువెళ్లిన సమయంలో బస్తాకి 40 కిలోలకు మాత్రమే కాటా వేయాలని నిబంధనలున్నా 46 కిలోలు చొప్పన తీసుకువెళ్లారన్నారు. ఇప్పుడు కూడా అలాగే కాటా వేశారని వివరిస్తూ తమకు 40 కిలోలకు మాత్రమే ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని అదనంగా ధాన్యం తరలిస్తున్నందుకు అదనంగా రూ.2వేలు చెల్లించాలని పట్టుపడుతున్నారన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని