logo

ఎన్నాళ్లీ ట్రాఫిక్‌ అవస్థలు?

విజయవాడకు వీవీఐపీల తాకిడి ఎక్కువైంది. దీంతో గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి వరకు ఉన్న జాతీయ ప్రధాన రహదారిపై రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్య జఠిలంగా మారుతోంది.

Published : 04 Dec 2022 03:37 IST

అభివృద్ధికి నోచని అప్రోచ్‌ రహదారులు
రామవరప్పాడు, న్యూస్‌టుడే

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో ఆగిన భారీ వాహనాలు

విజయవాడకు వీవీఐపీల తాకిడి ఎక్కువైంది. దీంతో గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి వరకు ఉన్న జాతీయ ప్రధాన రహదారిపై రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్య జఠిలంగా మారుతోంది. విజయవాడ నగరానికి మణిహారంగా ఉన్న ఇన్నర్‌రింగ్‌ రోడ్డు.. రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేయడానికి ప్రస్తుత పరిస్థితుల్లో కీలకంగా ఉంది. ఈ క్రమంలో వీవీఐపీలు విజయవాడకు వచ్చినప్పుడల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాలను ఈ రింగ్‌ రోడ్డుపై వాహనాలను గంటల తరబడి నిలిపివేస్తున్నారు.

* గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ వారధి వరకు, అలాగే విజయవాడ గ్రామీణ మండలం రామవరప్పాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు గ్రామాల నుంచి కానూరు, పోరంకి గ్రామాల మీదుగా బందరు రోడ్డుకు వెళ్లడానికి పలు రోడ్లు ఉన్నాయి. కానీ వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. దీంతో చిన్న, చిన్న వాహనాలు కూడా అటువైపునకు వెళ్లడానికి వారు ఆసక్తి చూపడం లేదు. ఎయిర్‌పోర్టు వైపునకు వీవీఐపీలు వెళ్లే సమయంలో విజయవాడలోని రామవరప్పాడు రింగు నుంచి ముస్తాబాద మీదుగా కేసరపల్లి వద్ద ఉన్న జాతీయ ప్రధాన రహదారి వైపునకు మళ్లించవచ్చు. ఈ రోడ్డు ద్వారా వాహనాలు కేసరిపల్లి వద్దకు చేరడానికి 30 నుంచి 45 నిమిషాల వరకు పట్టవచ్చు. ఈ సమయంలో వీవీఐపీలను వారి గమ్యస్థానాలకు చేర్చవచ్చు. ఈ రోడ్డును కృష్ణా పుష్కరాల సమయంలో అభివృద్ధి చేశారు. దానిలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ కూడా చేశారు. ట్రాఫిక్‌ను మళ్లించాల్సినప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతోందని వారు గుర్తించి, ఆ రహదారిని యుద్ధ ప్రాతికపాదిన పూర్తి చేశారు. కానీ ఆ రోడ్డును అందుబాటులోకి తీసుకుని రాకుండా వాహనాలను ఇన్నర్‌రింగ్‌పై సుమారు రెండు గంటల పాటు నిలిపివేస్తున్నారు. దానితో పాటు ఇక్కడి నుంచి గన్నవరం పరిసర ప్రాంతాల వరకు వెళ్లడానికి అప్రోచ్‌ రోడ్లు ఉన్నాయి. కానీ వీటి అభివృద్ధిపై అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు