logo

పై వంతెనకు భూమి పూజ

ప్రజలు మా వెంట ఉండి, ఈ సారి కూడా మద్దతిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు.

Published : 04 Dec 2022 03:37 IST

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ వల్లభనేని

నెహ్రూచౌక్‌(గుడివాడ), న్యూస్‌టుడే: ప్రజలు మా వెంట ఉండి, ఈ సారి కూడా మద్దతిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. పట్టణంలో రైల్వే క్రాసింగులపై నిర్మించనున్న పైవంతెన పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 317 కోట్లతో పై వంతెన నిర్మిస్తామన్నారు. దీంతోపాటు పామర్రు, గుడివాడ నాలుగు వరుసల రహదారి నిర్మిస్తామన్నారు. గుడివాడ నుంచి కంకిపాడు మీదుగా విజయవాడకు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ పట్టణ ప్రజల దశాబ్దాల కల త్వరలోనే సాకారమవుతుందన్నారు. జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, వైకాపా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్‌, పాలేటి చంటి, మండలి హనుమంతరావు, గొర్ల శ్రీను, మున్సిపల్‌ కమిషనరు సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని