నేర వార్తలు
గుర్తు తెలయని రైలు నుంచి ఓ గుర్తు తెలియని యువకుడు జారిపడి దుర్మరణం పాలయ్యాడని గుడివాడ రైల్వే ప్రభుత్వ పోలీసులు తెలిపారు.
రైలు నుంచి జారి పడి వ్యక్తి దుర్మరణం
గుడివాడ గ్రామీణం, గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: గుర్తు తెలయని రైలు నుంచి ఓ గుర్తు తెలియని యువకుడు జారిపడి దుర్మరణం పాలయ్యాడని గుడివాడ రైల్వే ప్రభుత్వ పోలీసులు తెలిపారు. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు-కవుతరం రైల్వే స్టేషన్ల మధ్యలో గుర్తు తెలియని 30 ఏళ్ల వయసు గల యువకుడు గుర్తు తెలియని రైలు నుంచి జారి పడి మృతిచెంది ఉండటాన్ని సిబ్బంది శనివారం గుర్తించారు. మృతుడు ఎరుపు రంగు శరీర ఛాయతో, బ్లూ జీన్స్ ప్యాంట్, గోదుమ రంగు పై డిజైన్ గలిగిన పొడవుచేతుల చొక్కా ధరించి ఉన్నాడు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ బి.వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ఆచూకి తెలిసిన వారు 94406 27570, 98495 96079 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
కాలువలో గుర్తు తెలియని పురుషుని మృతదేహం
కోడూరు (అవనిగడ్డ), న్యూస్‌టుడే: స్థానిక 11వ నెంబర్ పంట కాలువలో పాత సినిమా హాలు దగ్గర గుర్తు తెలియని పురుషుని మృతదేహం ఉండడం చూశామని పోలీసులు తెలిపారు. మృతుని వయస్సు 40 నుంచి 55 సంవత్సరాలు ఉండొచ్చని, శరీరంపై ఆకుపచ్చ నిలుపు చారల చొక్కా ధరించి ఉన్నట్లు చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు కోడూరు పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు.
ప్రయాణికుల అక్రమ రవాణాపై ఫిర్యాదు
విజయవాడ బస్టేషన్, న్యూస్‌టుడే: బస్టేషన్ పరిధిలో ప్రైవేటు వాహనాల ద్వారా ప్రయాణికులను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శనివారం జిల్లా పోలీసు కమిషనర్, డీటీసీలను కోరుతూ వినతిపత్రాలు ఇచ్చినట్లు ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వై.శ్రీనివాసరావు తెలిపారు. బస్టేషన్ పరిధిలో రెండు కిలోమీటర్ల వరకు ప్రైవేటు వాహనాలు నిలపకూడదని, వాటి ద్వారా ప్రయాణికులను తరలించకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
PM Modi: వారి ప్రవర్తన బాధాకరం.. విపక్షాలు విసిరే బురదలోనూ ‘కమలం’ వికసిస్తుంది: మోదీ
-
Movies News
Ott Movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు
-
Sports News
IND vs AUS: రవీంద్రజాలంలో ఆసీస్ విలవిల.. 200లోపే ఆలౌట్
-
World News
Bill Gates: మళ్లీ ప్రేమలో పడిన బిల్‌గేట్స్..?
-
Movies News
Janhvi Kapoor: వాళ్ల సూటిపోటి మాటలతో బాధపడ్డా: జాన్వీకపూర్
-
Politics News
Nara Lokesh - Yuvagalam: మరోసారి అడ్డుకున్న పోలీసులు.. స్టూల్‌పైనే నిల్చుని నిరసన తెలిపిన లోకేశ్