logo

మాజీ మంత్రా.. మజాకా?

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేరు కంకిపాడు ప్రాంతంలో కొద్ది రోజులుగా  చర్చనీయాంశంగా మారింది. 

Published : 06 Dec 2022 06:02 IST

కుమార్తె నిశ్చితార్థం కోసం రహదారికి మరమ్మతులు

బాగు చేసిన తర్వాత ఇలా..

కంకిపాడు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేరు కంకిపాడు ప్రాంతంలో కొద్ది రోజులుగా  చర్చనీయాంశంగా మారింది.  పదవి లేకున్నా ప్రభుత్వ యంత్రాగంపై ఇంత పట్టు ఉందా? అంటూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా తన కుమార్తె నిశ్చితార్థం వలెనే వివాహం కూడా కంకిపాడులోనే నిర్వహిస్తే రహదారులు బాగుపడతాయని అంటున్నారు. వేదిక మాత్రం కంకిపాడు రెండో తూము కూడలి సమీపంలోని ఫంక్షన్‌ హాల్‌ నుంచి తూర్పు వైపున ఉన్న ఏదైనా కల్యాణ మండపానికి మార్చాలని సూచిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. గత మూడేళ్లుగా ప్రజలు, ప్రయాణికులు మొరపెట్టుకున్నా కంకిపాడు ప్రధాన రహదారి(బందరు రోడ్డు)పై గమేళా(బొచ్చెడు) కంకర పోయలేదు. యువతే నడుంబిగించి కొంతమేర మరమ్మతులు చేశారు. వెలంపల్లి కుమార్తె నిశ్చితార్థం నేపథ్యంలో కంకిపాడు ఫంక్షన్‌ హాల్‌ వరకు యుద్ధప్రాతిపదికన నిర్వహించిన రహదారి మరమ్మతులను ప్రస్తావిస్తున్నారు. ఇక కంకిపాడు బందరు రోడ్డు భవిత వెలంపల్లి మీదే ఉంది? ఏమీ చేస్తారో? చూద్దాం.. అని కొందరు అంటుండగా.. ‘వెలంపల్లా? మజాకా’ అంటూ మరికొందరు సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని హల్‌చల్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని