logo

‘బీసీలను అణచివేస్తున్న వైకాపా ప్రభుత్వం’

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక బీసీ వర్గాల అణచివేతే ధ్యేయంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షు‘ కొనకళ్ల నారాయణరావు ఆరోపించారు.

Published : 06 Dec 2022 06:02 IST

నిరసన తెలుపుతున్న మాజీ ఎంపీ, తెదేపా నాయకులు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక బీసీ వర్గాల అణచివేతే ధ్యేయంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ, తెదేపా జిల్లా అధ్యక్షు‘ కొనకళ్ల నారాయణరావు ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై సోమవారం బస్టాండు సెంటరులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు గత మూడున్నర సంవత్సరాలుగా తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. విధులు, నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మోసం చేయడం ముఖ్యమంత్రి జగన్‌కే చెల్లిందని పేర్కొన్నారు. తెదేపా హయాంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా 3.75 లక్షల మందికి, ఫెడరేషన్‌ల ద్వారా 70 వేల మందికి రాయితీతో కూడిన రుణాలు ఇచ్చామన్నారు. జగన్‌ అధికారం చేపట్టాక రూ.34,000 కోట్ల బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. మోసాలకు, బెదిరింపులకు కాలం చెల్లిందని, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ సునీల్‌కుమార్‌కు వినతిపత్రం అందచేశారు. పార్టీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్‌, కాగిత వెంకటేశ్వరరావు, గోపు సత్యనారాయణ, తలారి సోమశేఖర్‌, బత్తిన దాస్‌, దేవరపల్లి అనిత, సమతాకీర్తి, పద్మజ, లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని