logo

‘దాచుకున్న డబ్బులు.. దోచుకుంటారా?’

దాచుకునే డబ్బులు.. దోచుకునే ప్రభుత్వం డౌన్‌ డౌన్‌ అంటూ యూటీఎఫ్‌ నాయకులు నినదించారు.

Published : 06 Dec 2022 06:13 IST

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల ఆందోళన

నిరసనలో పాల్గొన్న నాయకులు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: దాచుకునే డబ్బులు.. దోచుకునే ప్రభుత్వం డౌన్‌ డౌన్‌ అంటూ యూటీఎఫ్‌ నాయకులు నినదించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లెనిన్‌బాబు మాట్లాడుతూ మాట తప్పం..మడప తిప్పం అంటూనే ముఖ్యమంత్రి అనేక హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఎన్నికలు, జనగణన విధులనుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే వివిధ యాప్‌లతో బోధనకు దూరం అవుతున్నందున వాటి నుంచీ మినహాయింపు ఇవ్వాలని కోరారు. తాము దాచుకున్న పీఎఫ్‌ ఇతర డబ్బులను కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘ అధ్యక్షుడు కనకారావు మాట్లాడుతూ కాగితంపై మాత్రమే పదోన్నతులు కల్పించడాన్ని తాము ఎప్పుడూ చూడలేదన్నారు. వెంటనే పదోన్నతులు కల్పించడంతోపాటు బదిలీల ప్రక్రియ చేపట్టాలన్నారు. సంఘ నాయకులు కేఏ ఉమామహేశ్వరరావు, నీలం ప్రభాకరరావు, ఎండీ షౌకత్‌హుస్సేన్‌, జె.ప్రసాదరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని