logo

తానా అందించే ప్రతి రూపాయీ సద్వినియోగం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అమెరికాలోని తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) ద్వారా ఆదరణ కార్యక్రమాల కోసం

Published : 06 Dec 2022 06:13 IST

ఎడ్లంక విద్యార్థినులకు సైకిళ్లు అందజేస్తున్న తానా ప్రతినిధులు, బుద్ధప్రసాద్‌

అవనిగడ్డ, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అమెరికాలోని తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) ద్వారా ఆదరణ కార్యక్రమాల కోసం అందించే ప్రతి రూపాయీ సద్వినియోగం చేస్తామని తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జైశంకర్‌, తానా ట్రస్టీ రవి సామినేని పేర్కొన్నారు. సోమవారం స్థానిక గాంధీక్షేత్రంలో తానా పౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎడ్లంక గ్రామ విద్యార్థినులు 25 మందికి ఏర్పాటుచేసిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతి రెండేళ్లకోసారి ఈ ఆదరణ కార్యక్రమం ద్వారా కంటి, కాన్సర్‌ వైద్య పరీక్షలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 500 మందికి సైకిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 13 లక్షల డాలర్లు పేద వర్గాలకు అందించడం ద్వారా నిధులు సద్వినియోగం చేసినట్లు చెప్పారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్‌ మాట్లాడుతూ అమెరికాలో ఉన్నప్పటికీ మాతృభూమిని మరచిపోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎడ్లంక బాలికలు నదిని దాటి 3 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలు/కళాశాలలకు వస్తున్నారని చెప్పగానే 25 మందికి సైకిళ్లు అందించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. తానా కాబోయే అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్‌, నైనుపాటి విశ్వనాథ్‌, తానా పౌండేషన్‌ ట్రస్టీ రవి సామినేని, కిలారు ముద్దుకృష్ణ, చావా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని