logo

సంకల్ప సిద్ధి కేసులో మరో నలుగురి అరెస్టు

సంకల్ప సిద్ధి మల్టీ లెవల్‌ మార్కెటింట్‌ స్కీమ్‌ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో మరో నలుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Published : 07 Dec 2022 03:36 IST

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : సంకల్ప సిద్ధి మల్టీ లెవల్‌ మార్కెటింట్‌ స్కీమ్‌ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో మరో నలుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి గుత్తా వేణుగోపాల్‌తో సహా మరో నలుగురిని గత నెల 28న అరెస్టు చేసిన విషయం విదితమే. సంకల్ప సిద్ధి సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న కిరణ్‌ కోసం గాలింపు చేపట్టారు. ఇటీవల ఇతడిని బెంగళూరులో అదుపులోకి తీసుకుని, విజయవాడకు తరలించారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులు ఉన్నారని సీపీ కాంతిరాణాటాటా వెల్లడించారు. ప్రధానంగా కోర్‌ ఏజెంట్లు కొందరు ప్రజలను ఈ స్కీములో చేర్చేందుకు కీలకపాత్ర పోషించారు. వారిపై నిఘా ఉంచిన పోలీసులు.. అనంతపురానికి చెందిన నలుగురు కోర్‌ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 9 మందిని అరెస్టు చేయగా.. డైరెక్టర్‌ కిరణ్‌ వివరాలు తెలియరాలేదు. కంప్యూటర్‌ లావాదేవీలు ఎక్కువగా కిరణ్‌ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఇతడి నుంచి పూర్తి సమాచారం వస్తే.. ఈ స్కీమ్‌లో ప్రధాన సూత్రధారులు ఇంకా ఎవరు ఉన్నారు? తదితర విషయాలు వెలుగుచూస్తాయని పోలీసులు అంటున్నారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు