logo

మాకు చెప్పకుండా సమావేశమా?

ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎదురవుతున్న సమస్యలపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని, కనీసం సమావేశం.

Published : 07 Dec 2022 03:36 IST

అధికారులను ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యేలు పార్థసారథి, అనిల్‌కుమార్‌

ఉయ్యూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎదురవుతున్న సమస్యలపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని, కనీసం సమావేశం నిర్వహిస్తున్నామని తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని పెనమలూరు, పామర్రు ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కైలే అనిల్‌కుమార్‌లు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి ఉయ్యూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలో ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది, వ్యవసాయ సహకార సంఘాల సిబ్బందితో డీఎం శ్రీధర్‌, జిల్లా కో-ఆపరేటివ్‌ అధికారి ఫణికుమార్‌, డీఎస్‌వో పార్వతి, ఆర్డీవో విజయ్‌కుమార్‌లు సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అంతలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యేలు పార్థసారథి, అనిల్‌కుమార్‌లు మాట్లాడుతూ ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో రైతుల ఇబ్బందులు పట్టావా? ఆర్‌బీకేలో తేమ శాతం, మిల్లుల వద్ద తేమ శాతం వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో తేమ శాతమే పరిగణనలోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు దూరంగా ఉన్న మిల్లులను కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ. మిల్లర్లతో మిలాఖత్‌ అయ్యారా? అంటూ నిలదీశారు. సమావేశానికి రావడానికి జేసీకి తీరిక లేదా? అని ప్రశ్నించారు. డీఎం శ్రీధర్‌.. ఎమ్మెల్యేలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించగా మాకు చెప్పడం కాదని, రైతులకు ఇబ్బంది లేకుండా దగ్గరలో ఉన్న మిల్లులకు కేటాయించాలని, రైతులు సొంత వాహనాల్లో ధాన్యం రవాణా చేసుకునేలా అవకాశమిచ్చేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని