logo

16 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

పాతపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు.

Updated : 07 Dec 2022 05:19 IST

స్వాధీనం చేసుకున్న బియ్యంతో విజిలెన్స్‌ సీఐ వసంత్‌బాబు, పౌరసరఫరాల శాఖ ఆర్‌ఐ శరత్‌ తదితరులు

పాతపాడు(విజయవాడ గ్రామీణం), న్యూస్‌టుడే: పాతపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. గ్రామంలోని పోలవరం కాల్వ వెంబడి గల గుబ్బలగుట్ట సమీపంలో ఓ కోళ్ల ఫారం షెడ్‌లో బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో విజిలెన్స్‌ సీఐ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. సంచుల్లో 16 టన్నుల బియ్యం ఉన్నట్లు గుర్తించి పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వీటిని రేషన్‌ బియ్యంగా ధ్రువీకరించిన అధికారులు.. నిల్వ ఉంచిన సీహెచ్‌ నరేంద్రపై కేసు నమోదు చేశారు. బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలించారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంటు తహసీల్దార్‌ రవికుమార్‌, వీఆర్వో రఘు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని