logo

హోంగార్డుల సేవలు కీలకం: సీపీ

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుశాఖకు హోంగార్డులు వెన్నెముకగా నిలిచి, ఉత్తమ సేవలు అందిస్తున్నారని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణాటాటా పేర్కొన్నారు.

Published : 07 Dec 2022 03:36 IST

జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుశాఖకు హోంగార్డులు వెన్నెముకగా నిలిచి, ఉత్తమ సేవలు అందిస్తున్నారని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణాటాటా పేర్కొన్నారు. మంగళవారం ఉదయం సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ గ్రౌండ్స్‌లో 60వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. సీపీ హాజరై హోంగార్డుల జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారి నుంచి గౌరవ వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. 1948లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏర్పడిన ఈ విభాగంలో వైద్యులు, ఉన్నత ఉద్యోగులు స్వచ్ఛందంగా సేవ అందించారని తెలిపారు. మొదట్లో ఉచితంగా సేవలు అందించేవారని, కాలక్రమంలో వారికి గౌరవ వేతనం ఇస్తున్నారని తెలిపారు. హోంగార్డులు తమ విధులను అంకితభావంతో నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారని కొనియాడారు. పండుగలు, వీఐపీ పర్యటనల్లో పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారని భవిష్యత్తులో ఇదే విధంగా సేవలు అందించి ఎన్టీఆర్‌ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసిన పలువురు హోంగార్డులను సత్కరించారు.

అనంతరం సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ గ్రౌండ్‌ నుంచి హోంగార్డులు మహాత్మాగాంధీరోడ్డులో రోడ్‌వాక్‌ నిర్వహించారు. ‘చేయి చేయి కలుపుదాం... నిస్కామ సేవ చేద్దాం... దేశ పురోభివృద్ధికి పాటు పడదాం’ అంటూ బ్యానరు చేతపట్టి అడుగులో అడుగు వేస్తూ నిర్వహించిన రోడ్‌ వాక్‌ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డీసీపీలు డి.మేరీ ప్రశాంతి, ఎం.సత్తిబాబు, ఉదయరాణి, ట్రాఫిక్‌ డీసీపీ కె.శ్రీనివాసరావు, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ కె.శ్రీనివాసరావు, ఏఆర్‌ ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, ఏసీపీలు చెంచిరెడ్డి, మోహన్‌కుమార్‌, డాక్టర్‌ రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati krishna News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు