logo

హోం గార్డుల సంక్షేమానికి పెద్దపీట

హోంగార్డుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని, విధుల కేటాయింపులో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎస్పీ పి.జాషువా చెప్పారు.

Published : 07 Dec 2022 03:36 IST

మాట్లాడుతున్న ఎస్పీ జాషువా

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: హోంగార్డుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని, విధుల కేటాయింపులో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎస్పీ పి.జాషువా చెప్పారు. హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1963లో స్వచ్ఛందంగా ఆవిర్భవించిన హోం గార్డు వ్యవస్థ పోలీస్‌ శాఖలో అంతర్భాగంగా మారిందని అన్నారు. పోలీస్‌లతో సమానంగా, క్లిష్టతరమైన విధులను సైతం బాధ్యతాయుతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లాలో మొత్తం 852 మంది హోంగార్డులు సేవలు అందిస్తున్నారని, వారిలో 560 మంది శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, నేర పరిశోధన, పోలీస్‌ అంతర్గత భద్రత, వాహనాల డ్రైవర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 18 సంస్థల్లో 292 మంది డిప్యుటేషన్‌పై పని చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డులను సత్కరించారు. కారుణ్య నియామకం ద్వారా నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఏఎస్పీ ఎన్‌వీ రామాంజనేయులు, ఏఆర్‌ ఏఎస్పీ ఎస్‌వీడీ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిబ్బంది నగరంలో ర్యాలీ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని