logo

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి టోకరా

పెనమలూరు నుంచి లండన్‌ వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు నుంచి రూ.5.75 లక్షలు ఆన్‌లైన్‌ మోసానికి పాల్పడిన వ్యక్తులపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 08 Dec 2022 05:07 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: పెనమలూరు నుంచి లండన్‌ వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు నుంచి రూ.5.75 లక్షలు ఆన్‌లైన్‌ మోసానికి పాల్పడిన వ్యక్తులపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పెనమలూరుకు చెందిన ఓ యువతి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. ఆమె భర్త లండన్‌లో నివసిస్తుండటంతో కొద్దిరోజుల క్రితం భర్త వద్దకు వెళ్లింది. గత నెల 29వ తేదీన ఆమెకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను బ్రిటిష్‌ హైకమిషన్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు పేర్కొంటూ వీసా దరఖాస్తులో పూర్తి వివరాలు తెలుపలేదని, నీతో పాటు కుటుంబ సభ్యులను అరెస్టు చేయాల్సి వస్తుందని బెదిరించాడు. అరెస్టుల నుంచి తప్పించుకోవాలంటే రూ.5.75 లక్షలు జరిమానా చెల్లిస్తే సరిపోతుందని చెప్పడంతో భయాందోళనలకు గురైన ఆమె ఈ మొత్తాన్ని విడతల వారీగా ఆన్‌లైన్‌లో అతను తెలిపిన ఖాతాలకు పంపింది. ఆ తర్వాత తాను మోసపోయినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలుపడంతో ఆమె తల్లి బుధవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని