logo

మాతృ భాషను కాపాడుకోవడం మన బాధ్యత

విద్యాలయాల్లో పిల్లలకు తెలుగు ఔన్నత్యాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, భాష నశిస్తే జాతి నశిస్తుందని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.

Published : 08 Dec 2022 05:07 IST

ప్రసంగిస్తున్న మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్‌, వేదికపై ఎల్‌వీ సుబ్రహ్మణ్యం,

జొన్నవిత్తుల, పూర్వ జేడీ లక్ష్మీనారాయణ, తోటకూర ప్రసాద్‌ తదితరులు

ఉయ్యూరు, న్యూస్‌టుడే: విద్యాలయాల్లో పిల్లలకు తెలుగు ఔన్నత్యాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, భాష నశిస్తే జాతి నశిస్తుందని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. బుధవారం స్థానిక శ్రీవిశ్వశాంతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో తానా పూర్వాధ్యక్షుడు డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌ అధ్యక్షత నిర్వహించిన ‘జై తెలుగు’ కార్యక్రమంలో బుద్ధప్రసాద్‌ ఆత్మీయ అతిథిగా హాజరై ప్రసంగించారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విశిష్ట అతిథి పూర్వ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలుగుపై పట్టు సాధిస్తే ఇతర భాషలు సులువుగా అలవడుతాయన్నారు. మరో అతిథి ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సంకుచిత స్వభావానికి స్వస్తి చెప్పాలన్నారు. సాహితీ సమాఖ్య కార్యదర్శి ఎస్‌వీఎస్‌ లక్ష్మీనారాయణ, తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థల ఛైర్మన్‌ మాదల సుబ్రహ్మణ్యేశ్వరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెలుగు భాష,  సంస్కృతిపై విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని