logo

సుస్థిరాభివృద్ధి లక్ష్య ప్రణాళిక అమలుకు చర్యలు

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు (సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌) సంబంధించి ప్రణాళిక అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులకు సూచించారు.

Published : 09 Dec 2022 06:34 IST

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌బాషా

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు (సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌) సంబంధించి ప్రణాళిక అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సమీర్‌శర్మ, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గురువారం అమరావతి నుంచి నిర్వహించిన వీసీకి హాజరైన కలెక్టర్‌ జిల్లాలో ఆయా అంశాల వారీగా ప్రగతిని వివరించారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం ప్రత్యేక చొరవ చూపుతున్న సుస్థిర అభివృద్ధికి చెందిన 8 ప్రాధాన్య సూచికల్లో లక్ష్యాల సాధనకు అనుగుణంగా సమగ్ర సర్వే నిర్వహించాలని చెప్పారు.వైద్యారోగ్య శాఖలో అవసరమైన వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. టెలీ మెడిసిన్‌ విధానాన్ని పరిపూర్ణంగా అమలు చేయాలని, ఇంకా ప్రారంభం కాని హెల్త్‌ క్ల్లీనిక్‌ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి డా.గీతాబాయి, డీఎల్‌డీవో సుబ్బారావు, ఐసీడీఎస్‌ పీడీ సువర్ణ, వైద్యాధికారిణి శర్మిష్ట, ఆర్‌ఐవో రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యలకు పరిష్కారం

జిల్లాలో శాశ్వత భూహక్కు పథకం ద్వారా భూ సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ రంజిత్‌బాషా రాష్ట్ర భూపరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు చెప్పారు. ఆయన అమరావతి నుంచి నిర్వహించిన వీసీకి హాజరైన కలెక్టర్‌ జిల్లాలో పురోగతిని వివరించారు.

వీధి దీపాలపై దృష్టి సారించండి

పంచాయతీల్లో వీధి దీపాల ఏర్పాటు విషయమై శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నిర్వహించిన వీసీకి హాజరైన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ పనిచేయని వీధి దీపాలను గుర్తించి ఎల్‌ఈడీ బల్పుల ఏర్పాటుకు పంచాయతీల వారీగా నివేదిక సిద్ధం చేయాలన్నారు. చెత్త నుంచి సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు పారిశుద్ధ్య సిబ్బందికి వేతన బకాయిలు లేకుండా చూడాలని చెప్పారు. డీపీవో నాగేశ్వరనాయక్‌, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, జడ్పీ సీఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రగతి వివరించిన కలెక్టర్‌

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి నిర్వహించిన వీసీకి కలెక్టర్‌ రంజిత్‌బాషా, జేసీ అపరాజితసింగ్‌ హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ఇతర ప్రాధాన్యత అంశాలకు సంబంధించి జిల్లాలో పురోగతిని ఆయనకు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని