logo

రూ.లక్షలు పోశారు.. లక్ష్యాన్ని మరిచారు!

ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పనులు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

Updated : 09 Dec 2022 06:32 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే

పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పనులు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.  ఉంగుటూరు మండల కేంద్రంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలకు నాడు-నేడు మొదటి విడతలో భాగంగా రూ.24 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. గతంలో మొత్తం 104 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా.. నూతన విద్యా విధానం అమలులో భాగంగా 3, 4, 5వ తరగతులు స్థానిక జడ్పీలో విలీనం అయ్యాయి. దీంతో ప్రస్తుతం పాఠశాలలో 1, 2వ తరగతికి చెందిన కేవలం 24 మంది మాత్రమే చదువుతున్నారు. గతంలో నలుగురు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండగా.. తాజాగా ఇద్దరే మిగిలారు. ఇదిలా ఉండగా పాఠశాలకు కేటాయించిన ఆర్‌వో వాటర్‌ ప్లాంట్‌ మూలకు చేరడంతో చిన్నారులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి వద్ద నుంచి సీసాలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి అయినా విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేసి వెచ్చించిన ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని పాఠశాల ఆవరణలోని ఓ భవనంలోకి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని