logo

Vijayawada Railway Station: వరుసలో నిలబడే బాధ తప్పింది

రైల్వేస్టేషన్లలో జనరల్‌ టికెట్టు కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది.

Updated : 10 Dec 2022 09:06 IST

ఒకటో నెంబరు ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: రైల్వేస్టేషన్లలో జనరల్‌ టికెట్టు కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది. విజయవాడ కమర్షియల్‌ అధికారులు యూటీఎస్‌ యాప్‌ను విస్తృతంగా ప్రచారం చేయడంతో అత్యధిక ప్రయాణికులకు లైన్లో నిలబడి టికెట్లు తీసుకునే ప్రయాస తప్పింది. ముఖ్యంగా ఉదయం వేళల్లో విజయవాడ నుంచి విశాఖపట్నం, చెన్నై, సికింద్రాబాద్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రయాణికులు జనరల్‌ టికెట్ల కోసం లైనులో ఎక్కువ సేపు నిలబడేవారు. దీంతో ఒక్కొక్కసారి రద్దీ కారణంగా రైలు కూడా కదిలి పోయేది. కదిలే రైలు ఎక్కే ప్రయత్నంలో కొన్ని సందర్భాల్లో ప్రమాదాలూ జరిగేవి. రైల్వేస్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ను ప్రయాణికులు తమ స్మార్ట్‌ ఫోన్‌లో నిక్షిప్తం చేసుకున్న  యూటీఎస్‌ యాప్‌ ద్వారా స్కాన్‌ చేసి  నేరుగా టికెట్లు పొందుతున్నారు. దశలవారీగా అన్ని ప్లాట్‌ఫారాలలో వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ స్టేషన్‌లో మొత్తం 5 బుకింగ్‌ కౌంటర్ల వద్ద వీటిని ఏర్పాటు చేశామని డైరెక్టర్‌ పి.బి.ఎన్‌.ప్రసాద్‌ తెలిపారు. ఇవి ఏర్పాటు చేసిన తరువాత జనరల్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీ తగ్గిందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని