logo

Andhra News: డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నగ్న వీడియోల కలకలం

వైద్య ఆరోగ్య శాఖకు అనుబంధంగా పనిచేసే ఓ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు చెందిన నగ్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

Updated : 12 Dec 2022 08:55 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖకు అనుబంధంగా పనిచేసే ఓ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు చెందిన నగ్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఆ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఒక కళాశాల నిర్వాహక భాగస్వామికి అల్లుడు. ప్రస్తుతం ఏలూరు జిల్లా తణుకులో పనిచేస్తున్నారు. కర్నూలులో విధులు నిర్వహించే సమయంలో తనతో పాటు పనిచేసే ఒంగోలుకు చెందిన ఓ మహిళా అధికారిణిని లోబరుచుకుని లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆమె ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలిసి కొంతకాలం జీవనం సాగించినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానంటూ ఆ అధికారిణిని నమ్మించి మోసగించినట్లు తెలిసింది. ఈ విషయమై కర్నూలు జిల్లాలో పనిచేసే సమయంలోనే ఆమె అక్కడి అధికారులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు సమాచారం. అయినా తనకు న్యాయం జరగలేదంటూ ఆమె ఇప్పుడు మీడియాను ఆశ్రయించారు. ఈ విషయమై ఆ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతూ.. కర్నూలులో పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఆమెను మందలించారని.. కుటుంబం నుంచి తనను విడదీయడానికి ఆ అధికారిణి బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు. ఈ వీడియోల వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని