Kodali nani: రాజకీయాల్లో గొడవలు సర్వసాధారణం : కొడాలి నాని
పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా నాయకులు పాల్పడిన దాడులపై కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రాజకీయాల్లో గొడవలు ఇదే మొదటి, చివరి సారి కాదని..
నెహ్రూచౌక్(గుడివాడ), న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా నాయకులు పాల్పడిన దాడులపై కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రాజకీయాల్లో గొడవలు ఇదే మొదటి, చివరి సారి కాదని.. ఇలాంటి ఘటనలు సర్వసాధారణమన్నారు. శనివారం గుడివాడలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పట్టణంలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ 75 ఏళ్ల పైబడిన చంద్రబాబు బట్టలూడదీసి కొడతానని బహిరంగంగానే రోజూ అంటున్నారని.. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ, మాచర్లలో కొంతమంది చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని ఉంటారని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు మాచర్ల ప్రజలను ప్రభావితం చేసి ఉంటాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!