logo

ధరల వ్యత్యాసంతో రైతులకు నష్టం

జిల్లాకో విధంగా పురుగు మందుల ధరల నిర్ధారణతో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల రైతులు నష్టపోతున్నారని ఎరువులు, పురుగు మందుల చిల్లర వ్యాపారుల(రిటైల్‌ డీలర్లు) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి విజయకుమార్‌, ప్రధాన కార్యదర్శి భీమవరపు శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Published : 19 Jan 2023 06:06 IST

మాట్లాడుతున్న అధ్యక్షుడు విజయకుమార్‌, పక్కన ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి

ఈడుపుగల్లు(కంకిపాడు), న్యూస్‌టుడే : జిల్లాకో విధంగా పురుగు మందుల ధరల నిర్ధారణతో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల రైతులు నష్టపోతున్నారని ఎరువులు, పురుగు మందుల చిల్లర వ్యాపారుల(రిటైల్‌ డీలర్లు) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి విజయకుమార్‌, ప్రధాన కార్యదర్శి భీమవరపు శ్రీనివాసరెడ్డి చెప్పారు. బుధవారం కంకిపాడు మండలం ఈడుపుగల్లు సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పురుగు మందుల తయారీ కంపెనీలు కూడబలుక్కుని జిల్లా స్థాయిలో డిస్ట్రిబ్యూటర్లకు తమ ఉత్పత్తులను గంపగుత్తగా అప్పగిస్తున్నాయన్నారు. కంపెనీ, రకం, పరిమాణం ఒకటే అయినా చిల్లర వ్యాపారులకు గుంటూరు జిల్లాలో ఒక ధరకు, ఉమ్మడి కృష్ణాలో మరో రేటుకు అధికారికంగానే విక్రయిస్తున్నారన్నారు. ఈ రెండు ధరలను బేరీజు వేసుకున్న స్థానిక రైతులు క్షేత్ర స్థాయిలో రిటైల్‌ డీలర్లను నిలదీస్తున్నారన్నారు. ధర నిర్ధారణలో తమ పాత్ర లేదని చెప్పినా అవగాహన లోపంతో చిల్లర వర్తకులు దోచుకుంటున్నారనే అపోహలు పెంచుకుంటున్నారన్నారు. రైతులు నష్టపోవడంతోపాటు వివాదాలకు కారణమవుతున్న అశాస్త్రీయ విధానాన్ని రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధరను నిర్ధారించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీ నిబంధనలు ఉల్లఘించే డీలర్లపై చర్యలకు సంఘం మద్దతు ఇస్తుందన్నారు. గతంలో వలె నేరుగా ప్రభుత్వ అనుమతి పొందిన రిటైల్‌ డీలర్లకు ఉత్పత్తులను సరఫరా చేయడం ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఆధారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని