logo

కమనీయం.. స్వామి కల్యాణం

శ్రీవల్లీ అమ్మవారితో దేవసేనా సమేత సబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం గురువారం అర్ధరాత్రి కమనీయంగా సాగింది. ఆలయ ఆవరణంలో ప్రత్యేకంగా వేసిన కల్యాణ మండపం అలంకరణ ఆకట్టుకుంది.

Published : 27 Jan 2023 03:54 IST

మంగళసూత్రాలను చూపిస్తున్న అర్చకులు

మోపిదేవి, న్యూస్‌టుడే: శ్రీవల్లీ అమ్మవారితో దేవసేనా సమేత సబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం గురువారం అర్ధరాత్రి కమనీయంగా సాగింది. ఆలయ ఆవరణంలో ప్రత్యేకంగా వేసిన కల్యాణ మండపం అలంకరణ ఆకట్టుకుంది. ప్రధానార్చకుడు బుద్ధు పవన్‌కుమార్‌శర్మ, వేదపండితులు నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, కొమ్మూరి ఫణిశర్మ, బాలకృష్ణ, మణిదీప్‌ తదితరుల వేదమంత్రోచ్ఛారణ మధ్య ప్రతి ఘట్టాన్ని భక్తులకు వివరిస్తూ నిర్వహించారు. ఎమ్మెల్యే సింహాద్రి సతీమణి కెప్టెన్‌ లక్ష్మి, రాష్ట్ర వ్యవసాయ మండలి ఉపాధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులందరూ కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించేందుకు డిజిటల్‌ తెరలను ఏర్పాటుచేశారు. ఆలయ సహాయ కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షించారు.

నేడు రథోత్సవం: బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన గురువారం భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శారిక, చాతుర్య, రాజ్యశ్రీ, సృజన తదితరులు ప్రదర్శించిన కూచిపూడి బ్రహ్మాంజలి కరతాళ ధ్వనులను అందుకుంది. ఎదురుకోలు ఉత్సవం ఆద్యంతం ఆకట్టుకుంది. మోపిదేవి ఆలయ ప్రాంతం విద్యుత్తు సోయగాలతో నిండుదనం సంతరించుకుంది.శుక్రవారం రాత్రి 8 గంటలకు స్వామివార్ల రథోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఏసీ చక్రధరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని