logo

వివాహితను వేధిస్తున్న యువకుడి అరెస్టు

వివాహితకు తరచూ ఫోన్‌ చేసి అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్న ఓ యువకుడిని గుడివాడ టూటౌన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

Published : 27 Jan 2023 03:54 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: వివాహితకు తరచూ ఫోన్‌ చేసి అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్న ఓ యువకుడిని గుడివాడ టూటౌన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టూటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని నైజాంపేటకు చెందిన బాషా సత్యన్నారాయణపురంలో సీలింగ్‌, రంగుల పనుల కోసం వెళ్లి ఆ ఇంటి యజమానురాలి ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు. కొద్ది రోజుల నుంచి తరచూ ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అక్కడితో ఆగక తన కోరిక తీర్చాలని వేధిస్తున్నాడు. దీంతో భరించలేని ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి కామోన్మాదులపై ఫిర్యాదు చేసే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని.. ఆడపిల్లలు నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని సీఐ బి.తులసీధర్‌ తెలిపారు. ఆడ పిల్లలను వేధిస్తే ఎలాంటివారికైనా శిక్ష తప్పదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని