logo

మూలాలు మరువరాదు

మూలాలను మరువరాదని, అందుకే సొంత ఊళ్లను అభివృద్ధి చేయాలని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఉద్బోధించారు.

Published : 27 Jan 2023 03:54 IST

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌

తల్లి రామలక్ష్మమ్మతో ముచ్చటిస్తున్న రాజగోపాల్‌

నెల్లూరు, న్యూస్‌టుడే: మూలాలను మరువరాదని, అందుకే సొంత ఊళ్లను అభివృద్ధి చేయాలని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఉద్బోధించారు. గురువారం రాత్రి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని తరుణవాయి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన తన స్వగ్రామం అమరపనాయుడి కండ్రికలో ఆయన మాట్లాడుతూ మా తాతముత్తాతలు, తండ్రి జన్మించిన ఈ గ్రామం మాకు ఎంతో ముఖ్యమన్నారు. మా తండ్రి వెంకట్రామానాయుడు గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టారని, వృద్ధాశ్రమం నిర్మాణం ప్రారంభించారన్నారు. ఆయన మృతి చెందినా ఆశయాలు కొనసాగించాలని మాతల్లి రామలక్ష్మమ్మ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆమె ఇక్కడే ఉంటూ వాటిని కొనసాగిస్తున్నారని చెప్పారు. మార్చి 23వ తేదీ మా అమ్మ జన్మదినం నాడే దీన్ని ప్రారంభిస్తామన్నారు. గ్రామదేవత మహాలక్ష్మమ్మ మాను వద్ద పూజలు చేశారు. వృద్ధాశ్రమం పనులు పరిశీలించారు. తెదేపా నాయకుడు బి.శ్రీనివాసులురెడ్డి రాజగోపాల్‌ని సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని