Fire Accident: పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయ దుకాణ సముదాయంలో అగ్ని ప్రమాదం

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం దుకాణ సముదాయంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

Updated : 27 Jan 2023 06:59 IST

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే : పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం దుకాణ సముదాయంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయ ప్రాంగణంలోని బొమ్మల దుకాణంలో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే నెల అయిదో తేదీ నుంచి తిరునాళ్ల జరగనున్న నేపథ్యంలో వ్యాపారులు పెద్ద ఎత్తున సామగ్రి కొనుగోలు చేసి నిల్వ చేశారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో ఒక్కో దుకాణంలో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత వ్యాపారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జగ్గయ్యపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేశారు. మొత్తం 19 దుకాణాల్లో సుమారుగా రూ.50 లక్షల మేరకు ఆస్తి నష్ట జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్పంచి వేల్పుల పద్మకుమారి, దేవస్థానం అధికారులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున వచ్చి మంటల్ని ఆర్పేందుకు సహకారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని