పాముకాటుతో మృతి
పాముకాటుతో కుటుంబ యజమాని మృతిచెందిన సంఘటన మోపిదేవి గొల్లపాలెంలో శనివారం చోటుచేసుకుందని ఎస్‌ఐ పద్మ తెలిపారు. పెద్దిబోయిన గోవిందరాజు(45) పురుగుమందు కొట్టేందుకు బాడుగకు పొలం వెళ్లాడు.
పెద్దిబోయిన గోవింద రాజులు (పాత చిత్రం)
మోపిదేవి, న్యూస్‌టుడే: పాముకాటుతో కుటుంబ యజమాని మృతిచెందిన సంఘటన మోపిదేవి గొల్లపాలెంలో శనివారం చోటుచేసుకుందని ఎస్‌ఐ పద్మ తెలిపారు. పెద్దిబోయిన గోవిందరాజు(45) పురుగుమందు కొట్టేందుకు బాడుగకు పొలం వెళ్లాడు. మందుకొడుతుండగా పాము కరిచింది. అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతనికి భార్య బుజ్జి, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ యజమాని మృతితో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
చిత్తు కాగితాలు తిన్న యువకుడి మృతి
కంచికచర్ల: చిత్తు కాగితాలు తిన్న వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఎస్సై పి.సుబ్రహ్మణ్యం వివరాల మేరకు పెండ్యాల గ్రామానికి చెందిన షేక్ కరీమియా(27) కొంత కాలంగా మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. శుక్రవారం చెత్త కుప్పలోని సబ్బు, చిత్తు కాగితాలు తిని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు అతన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని