సహకార వ్యవస్థను పటిష్టపర్చుకోవాలి : నాబార్డు ఛైర్మన్
దేశంలో సహకార వ్యవస్థను పటిష్ట పర్చుకుంటే అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని నాబార్డు ఛైర్మన్ కె.వి.షాజీ అన్నారు.
కేడీసీసీబీ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న షాజీ
నాగాయలంక, న్యూస్‌టుడే: దేశంలో సహకార వ్యవస్థను పటిష్ట పర్చుకుంటే అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని నాబార్డు ఛైర్మన్ కె.వి.షాజీ అన్నారు. నాబార్డు నిధులు రూ.1.62 కోట్లతో పీఏసీఎస్ వ్యాపార దుకాణ సముదాయం, కేడీసీసీ బ్యాంకు భవనాల నిర్మాణానికి శనివారం ఆయన భూమి పూజ చేసి శిలఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం రేమాలవారిపాలెంలోని మార్కెటింగ్ కమిటీ యార్డు ఆవరణలో నిర్వహించిన సభలో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో సహకార వ్యవస్థకు ఆధ్యుడు పట్టాభి సీతరామయ్య అన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు, మత్స్యకారుల అభివృద్ధికి నాబార్డు అధిక ప్రాధాన్యతిస్తోందన్నారు. తీర ప్రాంతాల్లో వారధుల నిర్మాణానికి నాబార్డు సహకారం అందిస్తుందని చెప్పారు. మత్స్యకారుల్లో వృత్తి నైపున్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. మహిళల అభివృద్ధికి తోడ్పాటు నందిస్తుందన్నారు.
* మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ అర్హులైన మత్స్యకారులకు సహకార బ్యాంకుల నుంచి రుణాలివ్వాలని సూచించారు. రెండో పంట పండని రైతులకు రుణాలు, అధ్వానంగా ఉన్న రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని నాబార్డు ఛైర్మన్‌ను కోరారు.
* ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలో పరిశ్రమలు లేవని.. ఉన్న ఒక్క చక్కెర పరిశ్రమ (లక్ష్మీపురం) మూత పడిందన్నారు. తీర ప్రాంతంలో కోల్డ్‌స్టోరేజీ నిర్మాణానికి నాబార్డు కృషి చేయలన్నారు. అనంతరం 52 డ్వాక్రా గ్రూపులకు రూ.6.61 కోట్లు, మత్స్య మిత్ర గ్రూపులకు రూ.5.12 కోట్లు, ఫిష్ ఆంధ్ర పథకం ద్వారా రూ.1.85 కోట్లకు చెక్కులను అందజేశారు. కేడీసీసీబీ ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షతవహించగా జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఆప్కాబ్ ఛైర్‌పర్సన్ మల్లెల ఝాన్సీ, రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, జేసీ అపరాజిత సింగ్, ఎంపీపీ భోగాది రాఘవరాణి, తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు... న్యాయపరంగానే పోరాడతా
-
World News
గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట: పాకిస్థాన్‌లో 11 మంది మృత్యువాత
-
World News
5 నెలలకే పుట్టేశారు.. ముగ్గురు కవలల గిన్నిస్ రికార్డు
-
India News
20 రూపాయలకే మినీ హోటల్లో గది
-
Ts-top-news News
టోల్ రూపంలో 9 ఏళ్లలో రూ.9 వేల కోట్ల వసూలు
-
India News
బళ్లారి నగర పాలికె మేయర్‌గా 23 ఏళ్ల యువతి