logo

వేకనూరులో భక్తుల కిటకిట

రథ సప్తమి సందర్భంగా శనివారం వేకనూరు భక్తజన సందోహంతో కిటకిటలాడింది. మాఘ శుద్ధ సప్తమిని పురస్కరించుకొని ఉషా పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించారు.

Published : 29 Jan 2023 05:27 IST

సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవం

స్వామి వారికి క్షీరాభిషేకం చేస్తున్న రుత్వికులు.. పాల్గొన్న భక్తులు

అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: రథ సప్తమి సందర్భంగా శనివారం వేకనూరు భక్తజన సందోహంతో కిటకిటలాడింది. మాఘ శుద్ధ సప్తమిని పురస్కరించుకొని ఉషా పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం ప్రాంగణంలో విశాలమైన చలువ పందిళ్లు వేసి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు తుంగల వీరవసంతరావు, వాస్తు సిద్ధాంతి పాకలపాటి రామచంద్రరావు పర్యవేక్షించారు. ప్రధానార్చకుడు దీవి నరసింహమూర్తి ఆధ్వర్యంలో రుత్విక్కులు  అభిషేకాలు చేశారు. సూర్యనమస్కారాలు, లోక కల్యాణార్థం పుత్రకామేష్టి యాగాన్ని వైభవంగా నిర్వహించారు. 24 మంది దంపతులు ఈ క్రతువులో పాల్గొన్నారు. అనంతరం సూర్యనారాయణ స్వామి శాంతి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు.  ‌్ర వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులకు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు తుంగల వీర వసంతరావు ఆధ్వర్యంలో భారీ అన్నసంతర్పణ చేశారు. ‌్ర ఉత్సవ మూర్తులైన ఉషాపద్మినీ సమేత సూర్యనారాయణ స్వామి  ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక వాహనంపై ప్రతిష్ఠించి మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు రవిని సత్కరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని