logo

ఆకాశంలో అద్భుతం.. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు చూడొచ్చు..

రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కతం కానుంది. వేల సంవత్సరాల కిందట కనిపించిన తోక చుక్క తిరిగి ఆకాశంలో కనువిందు చేయనుంది.

Updated : 31 Jan 2023 08:06 IST

విజయవాడ(భవానీపురం), న్యూస్‌టుడే: రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కతం కానుంది. వేల సంవత్సరాల కిందట కనిపించిన తోక చుక్క తిరిగి ఆకాశంలో కనువిందు చేయనుంది. గ్రీన్‌ కొమెట్‌గా పిలిచే ఆ తోక చుక్కను ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విజయవాడ నగర వాసులు స్పష్టంగా వీక్షించవచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో చూడవచ్చు. మంచు యుగంలో 50 వేల సంవత్సరాల క్రితం కనిపించిన తోక చుక్క ప్రస్తుతం కనిపించనున్నట్లు అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.

సౌరవ్యవస్థలో తోక చుక్కలకు ఎంతో ప్రాధాన్యం

తోక చుక్కలు అంటే వాయువులతో నిండిన అంతరిక్ష మంచుగోళాలు. ఒక నగరం అంత వ్యాసంతో ఉంటాయి. సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేడెక్కి ధూళిని, వాయువులను అమితమైన వెలుగుతో బయటకు వెదజల్లుతాయి. అందువల్లే అవి తోకతో కనిపిస్తాయి. సౌరవ్యవస్థలో తోక చుక్కలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. భూమిపై జీవం ఏవిధంగా ఏర్పడిందో అనే విషయాన్ని కూడా తోక చుక్కల ద్వారా తెలుసుకోవచ్చు. సౌర కుటుంబం ఏర్పడిన నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా భూమి మీదకు జీవాన్ని తోక చుక్కలే తీసుకువచ్చాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న తోక చుక్కను వేల సంవత్సరాల తర్వాత నగర వాసులు తిలకించే అవకాశం ఏర్పడింది.

- అమృతాన్షు వాజపేయి, (సభ్యుడు, అక్షయ గంగ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ, ముంబయి)
- మేడూరు సురేష్‌ (విశ్వామిత్ర ఆమెచ్యూర్‌ ఆస్ట్రోనమర్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని