logo

పదవి ఆమెది.. పెత్తనం ఆయనది

మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉంటే పాలనలో భర్తలు లేదా కుటుంబ సభ్యుల జోక్యాన్ని అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలుసార్లు స్పష్టం చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కన్పిస్తున్నాయి.

Published : 31 Jan 2023 04:15 IST

ఎంపీపీ సీటులో కూర్చొని ఆదేశాలు జారీ చేస్తున్న ఆమె భర్త అచ్యుతరావు

పెడన, న్యూస్‌టుడే: మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉంటే పాలనలో భర్తలు లేదా కుటుంబ సభ్యుల జోక్యాన్ని అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలుసార్లు స్పష్టం చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. వైకాపా నుంచి ఎన్నికైన ఎంపీపీ రాజులపాటి వాణి నెలలో రెండు మూడ్రోజులు మాత్రమే తమ సీట్లో కన్పిస్తారు. ఇక మిగిలిన రోజుల్లో ఆమె భర్త, మండల పరిషత్తు ప్రత్యేక ఆహ్వానితుడు(నామినేటెడ్‌ పదవి) రాజులపాటి అచ్యుతరావు ఎంపీపీ సీట్లో కూర్చొని అధికారులు, ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. మహిళా ప్రజాప్రతినిధి స్థానంలో ఆమె భర్త పాలన సాగించటం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని