logo

దొంగ దొరికాడు

కృత్తివెన్ను మండలంలో వనామి చెరువుల వద్ద ఉన్న మేత బస్తాలను దొంగిలించిన కొండేటి ప్రేమరాజు అనే వ్యక్తిని పట్టుకుని అతని నుంచి రూ.5.8లక్షల విలువగల సరకు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై గణేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 31 Jan 2023 04:15 IST

ప్రేమరాజు, స్వాధీనం చేసుకున్న మేత బస్తాలతో ఎస్సై గణేష్‌కుమార్‌, సిబ్బంది

కృత్తివెన్ను, న్యూస్‌టుడే: కృత్తివెన్ను మండలంలో వనామి చెరువుల వద్ద ఉన్న మేత బస్తాలను దొంగిలించిన కొండేటి ప్రేమరాజు అనే వ్యక్తిని పట్టుకుని అతని నుంచి రూ.5.8లక్షల విలువగల సరకు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై గణేష్‌కుమార్‌ తెలిపారు. అతడ్ని అరెస్ట్‌ చేసి రిమాండు నిమిత్తం కోర్టులో హాజరు పరిచామన్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కృత్తివెన్ను మండలంలోని మాట్లం గ్రామానికి చెందిన తిరుమాని పాండురంగారావు షెడ్డులో ఉంచిన 69 మేత బస్తాలు, పెదచందాల గ్రామానికి చెందిన బర్రి పులిరాజు రొయ్యల చెరువు వద్ద ఉన్న షెడ్డులో 61 మేత సంచులను ఈ నెల 25న దొంగిలించినట్లు బాధితులిరువురూ కృత్తివెన్ను పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై గణేష్‌కుమార్‌ సిబ్బందితో ప్రత్యేక విచారణ చేపట్టగా 29వ తేదీ సాయంత్రం 5గంటల సమయంలో లక్ష్మీపురం పల్లెపాలెం గ్రామంలోని పడతడిక రోడ్డులో కొండేటి ప్రేమరాజును పట్టుకున్నారు. ఇతను పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని వైఎస్సార్‌ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనిపై ఇప్పటికే అత్తిలి పోలీస్‌ స్టేషన్‌లో 2కేసులు, పెనుమండ్ర, పాలకోడేరు, భీమవరం రూరల్‌, కలిదిండి, ముదినేల్లి పోలీస్‌ స్టేషన్‌లలో ఒక్కొక్క కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు