logo

ఏప్రిల్‌ నుంచి 5 వేల మందికి అన్నదానం

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించకున్న భక్తులకు ఏప్రిల్‌ నుంచి ప్రతి రోజు 5 వేల మందికి అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు.

Published : 31 Jan 2023 04:15 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించకున్న భక్తులకు ఏప్రిల్‌ నుంచి ప్రతి రోజు 5 వేల మందికి అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు. ‘అమ్మ ప్రసాదం కొందరికే’ శీర్షికన ఈ నెల 29న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి దేవస్థానం అధికారులు స్పందించారు. మల్లికార్జున మహామండపం రెండో అంతస్తులోని రెండు హాల్స్‌లో ఒక్కో దఫా 300 మంది చొప్పున అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు. సాధారణ రోజుల్లో 3 వేలు, శుక్ర, ఆదివారాల్లో 4 వేల మందికి అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు వీలుపడుతుందని పేర్కొన్నారు. భక్తులు సంఖ్య పెరిగినప్పుడు రెండు హాల్స్‌తోపాటు బఫే విధానంలో అన్నప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. దేవస్థానానికి భక్తులు ఇచ్చిన విరాళాలపైన ఏడాదికి రూ. 5.50 కోట్లు వడ్డీ రూపంలో ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం అన్న ప్రసాదానికి రూ.5.40 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తున్నామన్నారు. శాశ్వత అన్నప్రసాద భవన నిర్మాణం పూర్తయితే అన్నప్రసాదాన్ని ఎక్కువ మందికి పంపిణీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు