వివాహిత ఆత్మహత్య
కానూరులో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. కానూరు వరలక్ష్మీపురంలో నివసించే మేకా పావని(37), త్రివెంకట శ్రీనివాసరావులు భార్యా భర్తలు.
పెనమలూరు: కానూరులో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. కానూరు వరలక్ష్మీపురంలో నివసించే మేకా పావని(37), త్రివెంకట శ్రీనివాసరావులు భార్యా భర్తలు. పటమట రైతుబజారులో కూరగాయల దుకాణం నిర్వహిస్తుంటారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పావని కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల ఈ సమస్య మరింత ఎక్కువ కావడంతో ఆమె తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతోంది. సోమవారం ఆమె ఇంట్లోనే ఉంది. ఉదయం కుమార్తె పాఠశాలకు, కుమారుడు కళాశాలకు, భర్త దుకాణానికి వెళ్లారు. సాయంత్రం 3 గంటల సమయంలో కుమారుడు జయంత్ కళాశాల నుంచి ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంటి తలుపులకు లోపలి నుంచి గడియపెట్టి ఉండడం, ఎంతకూ తెరవకపోవడంతో స్థానికుల సాయంతో కుమారుడు తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించాడు. అప్పటికే పావని వంటగదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి తండ్రి శ్రీనివాసరావుకు సమాచారం అందించాడు. అతను వచ్చి పరిశీలించి కన్నీటి పర్యంతరమయ్యాడు. వారి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పావని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ
-
Movies News
Social Look: ఫొటో ఎంపిక చేసుకోమన్న యషిక.. పెయింటింగ్‌ని తలపించేలా మీనాక్షి స్టిల్!
-
Politics News
DK Shivkumar: ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకేఎస్.. వీడియో వైరల్