logo

కట్టలు కరిగిపోతున్నాయి..

పోలవరం కుడి కాల్వ గట్లపై ఉన్న మట్టి, గ్రావెల్‌ దోపిడీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

Published : 01 Feb 2023 05:04 IST

తరిగిపోయిన మట్టి కొండలకు నిదర్శనంగా..

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: పోలవరం కుడి కాల్వ గట్లపై ఉన్న మట్టి, గ్రావెల్‌ దోపిడీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. జాతీయ రహదారుల విస్తరణ పేరుతో ఏడాది కిందటి వరకు వేలేరు, రేమల్లె, రంగన్నగూడెం, బండారుగూడెం పరిధిలో ఎడాపెడా తవ్వకాలు జరిపిన అక్రమార్కులు, తాజాగా ప్రైవేటు అవసరాలకు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతులు ఉన్నాయని కొందరు, వాటితో పనేంటన్నట్లుగా మరికొందరు యథేచ్ఛగా గట్లను తవ్వి తరలించేశారు. బాపులపాడు మండల పరిధిలో ఈ కారణంగా పోలవరం కాల్వ గట్లు, భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేసిన మట్టి గుట్టలు తరిగిపోతున్నాయి. తాజాగా బండారుగూడెం సరిహద్దులో భారీ ఎత్తున తవ్వకాలు ప్రారంభమయ్యాయి. పదుల సంఖ్యలో టిప్పర్లు ఒకేసారి బారులు తీరి మట్టి, గ్రావెల్‌ని వివిధ ప్రాంతాలకు తరలించుకుపోయాయి. దీని వెనక అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని